న్యూఢిల్లీ: హై స్పీడ్ ఛేజింగ్ నేపథ్యంలో స్మగ్లర్లు లారీ నుంచి ఆవులను రోడ్డుపైకి తోసేశారు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని హర్యానాలోని గురుగ్రామ్‌లో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పశువుల స్మగ్లర్లు ఒక లారీలో ఏడు ఆవులను ఢిల్లీ నుంచి మేవాట్‌లోని పశువధశాలకు తరలిస్తున్నారు. ఆ లారీ గురుగ్రామ్‌లోకి ప్రవేశించగా గో సంరక్షకులు దీనిని పసిగట్టారు. పోలీసులతో కలిసి కొన్ని కార్లలో ఆ లారీని అనుసరించారు. లారీని ఆపేందుకు తుపాకీతో టైర్లపై కాల్పులు జరిపారు.
అయినప్పటికీ స్మగ్లర్లు లారీని ఆపలేదు. అనుసరిస్తున్న వాహనాలను నిలువరించేందుకు స్మగ్లర్లు లారీలోని ఆవులను రోడ్డుపైకి తోసేశారు. దీంతో ఏడు ఆవుల్లో రెండు తీవ్రంగా గాయపడ్డాయి. సుమారు 22 కిలోమీటర్ల ఛేజింగ్ తర్వాత లారీలోని ఐదుగురు స్మగ్లర్లు పోలీసులకు లొంగిపోయారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.
కాగా, బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం ఆవుల స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాలు చేసింది. గో రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఆవుల అక్రమ రవాణా ఆగడం లేదు. మరోవైపు హై స్పీడ్ ఛేజింగ్‌లో స్మగ్లర్లు లారీ నుంచి ఆవులను రోడ్డుపైకి తోసేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Earlier today, Gau Rakshak's caught "Cattle Smugglers" in #Gurugram, smugglers threw the cow from running vehicle. pic.twitter.com/7eXyba1PRj
— Nikhil Choudhary (@NikhilCh_) April 9, 2022