Smuggler Caught During Pushpa 2 Screening | పుష్ప 2 సినిమాను ఎంజాయ్ చేస్తున్న స్మగ్లర్.. పోలీసులు ఏం చేశారంటే?
Smuggler Caught During Pushpa 2 Screening | డ్రగ్స్ స్మగ్లింగ్‌తోపాటు రెండు హత్యా కేసుల్లో నిందితుడైన వ్యక్తి పుష్ప 2 సినిమా చూస్తూ ఆనందంలో మునిగిపోయాడు. అయితే థియేటర్లోకి ప్రవేశించిన పోలీసులు అతడికి షాక్ ఇచ్చారు.
ముంబై: డ్రగ్స్ స్మగ్లింగ్‌తోపాటు రెండు హత్యా కేసుల్లో నిందితుడైన వ్యక్తి పుష్ప 2 సినిమా చూస్తూ ఆనందంలో మునిగిపోయాడు. అయితే థియేటర్లోకి ప్రవేశించిన పోలీసులు అతడికి షాక్ ఇచ్చారు. వారి కళ్లగప్పి తప్పించుకుని తిరుగుతున్న ఆ నిందితుడ్ని అరెస్ట్ చేశారు. (Smuggler Caught During Pushpa 2 Screening) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. గ్యాంగ్‌స్టర్ విశాల్ మేష్రామ్పై 27 కేసులున్నాయి. ఇద్దర్ని హత్య చేయడంతోపాటు డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడిన అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే గత పది నెలలుగా వారి కళ్లగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు.
కాగా, విశాల్ ఇటీవల కొత్త కారు కొన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతడి కదలికలపై నిఘా పెట్టారు. హీరో అల్లు అర్జున్ తాజా మూవీ ‘పుష్ప 2: ది రూల్’ సినిమా చూడటం పట్ల అతడు ఆసక్తి చూపుతున్నట్లు పసిగట్టారు. గురువారం అర్ధరాత్రి వేళ మల్టీప్లెక్స్‌లో ఆ సినిమా చూడటంలో నిమగ్నమైన విశాల్‌కు షాక్ ఇచ్చారు.
మరోవైపు థియేటర్‌కు చేరుకున్న పోలీసులు ముందు జాగ్రత్తగా కారు టైర్లలో గాలి తీసేశారు. ఆ తర్వాత సినిమా హాల్లోకి ప్రవేశించారు. పుష్ప సినిమా చూడటంలో బిజీగా ఉన్న విశాల్‌ను చుట్టుముట్టి అతడ్ని అరెస్ట్ చేశారు. మిగతా ప్రేక్షకులకు ఇబ్బంది కలుగకుండా వెంటనే అతడ్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. సినిమా సన్నివేశాన్ని తలపించేలా ఉన్న ఇది చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- caught
- Maharashtra
- Nagpur
- pushpa 2
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

