Cancer | న్యూఢిల్లీ: రుతుస్రావ రక్తాన్ని పరీక్షించి క్యాన్సర్, శరీరం లోపలి భాగాల్లో మంటకు సంబంధించిన వ్యాధులను గుర్తించే స్మార్ట్ శానిటరీ ప్యాడ్స్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ వినూత్న విధానంలో, శానిటరీ టవల్లో నాన్ ఎలక్ట్రానిక్ సెన్సర్‌ను ఉంచుతారు.
స్మార్ట్‌ఫోన్‌తో తీసిన ఫొటోలను, మెన్స్ట్రుఏఐ అనే ప్రత్యేకమైన యాప్‌ను ఉపయోగించి రుతుస్రావ రక్తాన్ని పరీక్షిస్తారు. దానిలోని బయోమార్కర్స్ను విశ్లేషిస్తారు. ఈ రక్తం చాలా విలువైన సమాచారానికి ఆధారమని తాము నిరూపించామని ఈ అధ్యయనకర్తల్లో ఒకరైన లూకాస్ డోస్నన్ చెప్పారు.