చిన్న జ్వరానికే యాంటిబయాటిక్స్ వద్దు
యాంటిబయాటిక్స్ వినియోగంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) కీలక సూచనలు చేసింది. చిన్నపాటి జ్వరం, వైరల్ శ్వాసనాళాల వాపు వంటి ఇతర పరిస్థితులకు యాంటిబయాటిక్స్‌ను సిఫారసు చేయొద్దని వైద్యులకు సూచించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 27: యాంటిబయాటిక్స్ వినియోగంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) కీలక సూచనలు చేసింది. చిన్నపాటి జ్వరం, వైరల్ శ్వాసనాళాల వాపు వంటి ఇతర పరిస్థితులకు యాంటిబయాటిక్స్‌ను సిఫారసు చేయొద్దని వైద్యులకు సూచించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. యాంటిబయాటిక్స్ సూచించేటప్పుడు ఓ కాలపరిమితి అనేది పాటించాలని తెలిపింది. యాంటిబయాటిక్స్ ఆపేసేందుకు తేదీని ముందుగానే నిర్ణయించాలని పేర్కొన్నది.
సామాజిక వ్యాప్తి న్యుమోనియాకు ఐదు రోజులు, దవాఖానలో వచ్చిన న్యుమోనియాకు 8 రోజులు.. చర్మం, మృదు కణజాల ఇన్ఫెక్షన్లకు ఐదు రోజుల యాంటిబయాటిక్ థెరపీని ఐసీఎంఆర్ సిఫారసు చేసింది. దేశవ్యాప్తంగా యాంటిబయాటిక్స్ రెసిస్టెన్స్‌లో ట్రెండ్‌ను గుర్తించడానికి ఐసీఎంఆర్ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. రక్తం, మూత్రనాళాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్కు కారణమయ్యే గ్రామ్-నెగెటివ్ బ్యాక్టీరియా ‘అసినెటోబాక్టర్ భౌమన్ని’ అనేది ఎక్కువ పవర్ ఉండే యాంటిబయాటిక్స్‌పై అధిక నిరోధకత కలిగి ఉన్నట్టు గుర్తించారు. అసినెటోబాక్టర్ భౌమన్నికి చెందిన 87.5 శాంపిల్స్ హై ఎండ్ యాంటిబయాటిక్ కార్బపెనెమ్స్కు వ్యతిరేక నిరోధకత కలిగి ఉన్నాయని గతంలోనూ సర్వే కనుగొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

