న్యూఢిల్లీ: బహిరంగంగా మూత్ర విసర్జన చేయవద్దన్న వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా కొట్టాడు. ఫుట్‌పాత్‌పై నిద్రించిన ఆ వ్యక్తిని గుర్తించిన తర్వాత కర్రతో దాడి చేశాడు. (Sleeping Man Beaten) ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. గురువారం మోడల్ టౌన్ ప్రాంతంలోని పార్క్ వద్ద ఆర్యన్ అనే వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేయడంపై రాంఫాల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, ఆ తర్వాత ఆర్యన్ తన స్నేహితులతో కలిసి బైక్‌పై ఆ ప్రాంతానికి వచ్చాడు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న రాంఫాల్ దుప్పటి తొలగించి అతడ్ని గుర్తించాడు. అనంతరం చేతిలో ఉన్న కర్రతో దారుణంగా కొట్టాడు. అక్కడి నుంచి వెళ్తూ మళ్లీ వెనక్కి వచ్చాడు. నిల్చొని బాధతో అల్లాడిపోయిన రాంఫాల్ను మళ్లీ చితకబాదాడు. ఆ వీధిలోకి ఒక కారు రావడం చూసిన ఆర్యన్ తన ఫ్రెండ్స్ బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. రాంఫాల్ను కర్రతో దారుణంగా కొట్టిన ఆర్యన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్‌పై విడుదలైనట్లు తెలుస్తున్నది.
देश धड़कन दिल्ली का “खौफनाक” बेहद डरावना CCTV वायरल वीडियो !!
कुछ ही सेकेंड में 21 डंडे मारे?
दिल्ली के मॉडल टाउन में एक व्यक्ति आराम से भगवा चादर ओढ़ कर सोया है !!
बाइक पर गुंडे आते है और डंडो से मारना शुरू कर देते है !!#ViralVideo #CCTVliveviralVideo #DelhiNews #DelhiCrime pic.twitter.com/8r820d5Q87— Najafgarh Confessions (@najafgarhconfes) October 6, 2024