న్యూఢిల్లీ: డిమాండ్ల సాధనకు రైతుల ఆందోళన, రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న క్రమంలో వారి సమస్యలపై చర్చించేందుకు తమకు సమయమివ్వాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసింది.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన చేస్తున్నారని, డల్లేవాల్ ఆమరణ దీక్ష చేస్తున్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా 500 జిల్లాలకు చెందిన రైతులు ఇప్పటికే రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాలు సమర్పించారని, రైతు సమస్యలపై చర్చించేందుకు సమయం కేటాయించాలని ఎస్కేఎం విజ్ఞప్తి చేసింది.