గ్యాంగ్టక్ : ఎస్కేఎం చీఫ్ పీఎస్ తమాంగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా ఈ నెల 10న ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తారని మొదట్లో ఆ పార్టీ తెలిపింది. కానీ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ఆదివారం హాజరుకాబోతున్నారు. దీంతో తన ప్రమాణ స్వీకారాన్ని సోమవారానికి వాయిదా వేసినట్లు ఎస్కేఎం తెలిపింది.