Graduates | బెంగళూరు, ఆగస్టు 1: దేశంలో ఏటా లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వస్తున్నారు. ఉద్యోగ వేటలో తలమునకలవుతున్నారు. అయితే వీరిలో సగం మందికిపైగా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలు లేవని తాజా అధ్యయనంలో తేలింది. కేవలం 45 శాతం మంది అభ్యర్థులకు మాత్రమే స్కిల్స్ ఉన్నట్టు వెల్లడైంది. దాదాపు 2,500 కాలేజీల్లో 4,40,000 మంది విద్యార్థులపై అధ్యయనం నిర్వహించిన ఆన్లైన్ ట్యాలెంట్ అసెస్మెంట్ కంపెనీ మెర్సెర్ ‘ఇండియాస్ గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్-2023’ పేరుతో నివేదిక విడుదల చేసింది. టెక్నికల్ నైపుణ్యాల్లో అధిక ఉద్యోగార్హతలు ఉన్న అభ్యర్థులను గుర్తించడం కంటే నాన్ టెక్నికల్ ఉద్యోగాల అభ్యర్థులను గుర్తించడం సులభంగా ఉన్నదని పేర్కొన్నది.
Ppp