ముంబై, జూలై 7 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర లోని లోహగఢ్ కోట వద్ద జరిగిన పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. అగర్వాల్ కాబోయే భార్య సియా.. తన ప్రియుడు చేతన్‌ను రహస్యంగా పెండ్లి చేసుకున్నట్టు తెలిసింది. కేతన్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాతే వీరు వివాహం చేసుకున్నట్టు దర్యాప్తులో తేలిందని తెలిసింది.
కేతన్-సియాల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరుగగా, నవంబర్‌లో వివాహం జరుగాల్సి ఉంది. అయితే ఈ పెండ్లి ఇష్టం లేని సియా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నాలుగు నెలల కిందటే పుణెలోని రిజిస్ట్రార్ ఆఫీస్‌లో చేతన్‌ను వివాహం చేసుకుంది. వీరికి వివాహ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యిందా లేదా అన్న విషయాన్ని వారు ఆరా తీస్తున్నారు.