సంక్రాంతికి సంబరాల ఏటిగట్టు
మెగా హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’(SYG). ఐశ్వర్యలక్ష్మి కథానాయిక. రోహిత్ కేపి దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.
మెగా హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’(SYG). ఐశ్వర్యలక్ష్మి కథానాయిక. రోహిత్ కేపి దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్టు శనివారం మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో సాయిదుర్గతేజ్ ఇంటెన్స్ మాస్ అవతారంలో కనిపిస్తున్నారు.
గాయాలతో నిండిన శరీరంతో రక్తం కారిపోతున్నా లెక్కచేయకుండా.. మంటల మధ్య ఆయుధాన్ని చేతబూని పరుగెడుతూ టెర్రిఫిక్‌గా సాయిదుర్గతేజ్ కనిపిస్తున్నారు. గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా ఇదని మేకర్స్ తెలిపారు.ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

