Delhi | న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం ఆరో తరగతి విద్యార్థి బ్యాగులో తుపాకీని చూసి పాఠశాల సిబ్బంది అవాక్కయ్యారు. వెంటనే నజఫ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. విద్యార్థి వద్ద ఉన్న తుపాకీలో మ్యాగజైన్ లేదు. దీంతో అతని తల్లిని ప్రశ్నించారు. ఆ తుపాకీ తన భర్తదని, ఆయన కొద్ది నెలల క్రితం మరణించారని, తుపాకీని పోలీస్ స్టేషన్‌కు అప్పగించేందుకు దానిని బయట పెట్టానని చెప్పారు. బాలుడిని ప్రశ్నించినపుడు అది ఆట బొమ్మ అనుకుని, బడికి తీసుకొచ్చానని చెప్పాడు. తుపాకీ లైసెన్స్ సరైనదేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. తుపాకీని పోలీసు స్టోర్‌హౌస్‌కు అప్పగించారు.
చోరీకి వచ్చిన దొంగను ఆకర్షించిన పుస్తకం.. బుక్కయిపోయాడు!
రోమ్: ఇటలీ రాజధాని రోమ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ దొంగ (38)ను ఓ ఇంట్లోని టేబుల్‌పై కనిపించిన పుస్తకం ఆకర్షించింది. దీంతో చోరీకి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి పుస్తకం చదవడంలో అతడు మునిగిపోయాడు. మెలకువ వచ్చిన యజమాని (71) వచ్చి అతడిని తడితే కానీ ఈ లోకంలోకి రాలేదు. ఆయనను చూసి షాకైన దొంగ పరారయ్యేందుకు ప్రయత్నించాడు.
అయితే అప్పటికే అతడు పోలీసులకు దొరికిపోయాడు. దొంగను అంతగా ఆకర్షించిన ఆ పుస్తకం పేరు ‘ది గాడ్స్ ఎట్ సిక్స్ ఓ క్లాక్’. గ్రీకు పురాణాలకు సంబంధించిన ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత గియోవన్నీ నుచీ రాశారు.