న్యూఢిల్లీ: ఐర్లాండ్లో మరో జాత్యహంకార ఘటన చోటుచేసుకుంది. వాటర్ఫోర్డ్లో ఆరేండ్ల భారత సంతతి బాలికపై ఓ బాలుర గుంపు దాడి చేసింది. ముఖంతోపాటు ఆమె వ్యక్తిగత అవయవాలపై వారు దాడి చేశారు.
ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలంటూ అరిచారు. సోమవారం సాయంత్రం బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఇంటి బయట ఆడుకొంటూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఐర్లాండ్లో భారతీయులపై ఇటీవలి కాలంలో తరచూ దాడులు జరుగుతున్నాయి.