భోపాల్: మధ్యప్రదేశ్లోని మైహార్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. మృతుల్లో నాలుగేండ్ల చిన్నారి కూడా ఉన్నది. ప్రయాగ్రాజ్ నుంచి నాగ్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులు 45 మంది ప్రయాణికులు న్నారని వెల్లడించారు.

ఈ ఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. జేసీబీ, గ్యాస్ కట్టర్ సహాయంతో బస్సు డోర్ కట్చేసి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చామని చెప్పారు. ప్రయాణికుల్లో కొందరు కిటికీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని వెల్లడించారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.