న్యూఢిల్లీ: ఢిల్లీ శివారు ప్రాంతమైన మంగల్‌పురిలో కత్తి దాడి(Knife Attacks) ఘటనలు చోటుచేసుకున్నాయి. కొంత మంది యువత కత్తులు పట్టుకుని.. ఎదురు వచ్చిన వారిపై అటాక చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మంగల్పురిలోని ఎల్ బ్లాక్‌లో ఉన్న మూడు లేన్లలో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తెలిసింది. గాయపడ్డవారిని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇద్దర్ని సఫ్దార్జంగ్ బ్లాక్‌కు రిఫర్ చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పాత కక్షల వల్ల ఇలాంటి దాడులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా అంచనా వేస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిలో కొందరు బాల నేరస్థులు ఉన్నట్లు గమనించారు. దాడి చేసి కొందరు లూటీకి కూడా పాల్పడినట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.