న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని నందీగ్రామ్, రెజినగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఉప ఎన్నిక(West Bengal Bypolls) జరుగుతున్నది. అయితే జనతా ఉన్నాయన్ పార్టీ చీఫ్, ఎమ్మెల్యే హుమయున్ కబీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముర్షీదాబాద్‌లో పార్టీ ఆఫీసు నుంచి ఆయన్ను రెజినగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెజినగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఇవాళ ఉదయం కబీర్ ఓటు వేశారు. బెంగాల్, తమిళనాడు, పుదుచ్చరిలో 5 అసెంబ్లీ, అస్సాంలో ఓ లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
బెంగాల్లో నందీగ్రామ్ స్థానం నుంచి సీఎం సువేంధు అధికారి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. గత ఎన్నికల్లో సువేంధు రెండు స్థానాల నుంచి గెలిచిన విషయం తెలిసిందే. ఇక రెజినగర్ స్థానాన్ని కబీర్ ఖాళీ చేశారు. రెజినగర్తో పాటు నౌదా నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. రెజినగర్కు రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆ సీటు కోసం బీజేపీ నుంచి సఖర్వ సర్కార్, టీఎంసీ తరపున రాబివుల్ ఆలమ్ చౌదరీ, టీఎంసీ రెబల్ అభ్యర్థిగా సఫిజ్జమాన్ షేక్, కాంగ్రెస్ అభ్యర్థిగా మొహమ్మద్ అబ్దుల్లాహిల్ కఫి, సీపీఐ అభ్యర్థిగా సయ్యద్ అసద్ అలీ పోటీపడుతున్నారు.
రెజినగర్‌లో 2.57 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 315 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరుగుతున్నది. నందీగ్రామ్‌లో 2.67 లక్షల ఓటర్లు ఉన్నారు. 323 పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 9వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు.
#WATCH | West Bengal: Aam Janata Unnayan Party (AJUP) chief and MLA Humayun Kabir being taken away by Rejinagar Police from his party office in Murshidabad. More details awaited.
Earlier today, he cast his vote in the Rejinagar Assembly constituency by-election. https://t.co/64BUjurfKQ
— ANI (@ANI) October 6, 2026