లక్నో, జూన్ 11: యూపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ‘ఇండియా కూటమి’లో ఉత్సాహాన్ని నింపాయి. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీకి 37 స్థానాలు, కాంగ్రెస్‌కు 6 స్థానాలు దక్కాయి. బీజేపీ 33 స్థానాలకు పరిమితమైంది. కూటమికి చెందిన అరడజనకు పైగా ఎంపీలు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. వీరికి జైలు శిక్ష రెండేండ్లకు మించి ఉంటే.. ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదముంది.
ఘజియాపూర్ నుంచి గెలుపొందిన అఫ్జల్ అన్సారీ గ్యాంగ్‌స్టర్ కేసులో దోషిగా తేలారు. అజంగఢ్ ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌పై నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జౌన్పూర్ ఎంపీ బాబు సింగ్ కుశ్వాహాపై 25 కేసులున్నాయి. ఇండియా కూటమికి చెందిన ఇతర ఎంపీలు రాంభువాల్ నిషాద్, ఎస్పీ వీరేంద్ర సింగ్, ఇమ్రాన్ మసూద్, చంద్రశేఖర్ ఆజాద్‌పై కూడా కేసులు ఉన్నాయి.