Nasik Car Accident : మహరాష్ట్ర నాసిక్ జిల్లాలో ఘోర కారు ప్రమాదం జరిగింది. ఆదివారం సప్తశృంగ్ ఘాట్ రోడ్డు (Sapta Shrung Ghat Road) మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఘాట్ రోడ్డులో వెళ్తున్న కారు హఠాత్తుగా లోయలో పడింది. ఈ ఘటనలో అందులోని ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
నాసిక్‌లో ప్రసిద్ధిగాంచిన సప్తశృంగి దేవీ (Saptashrungi Devi) ఆలయానికి వెళ్లి వస్తుండగా కారు లోయలో పడిందా? లేదంటే వెళ్తుండగా ప్రమాదం జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. కారు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.