చెన్నై: తమిళనాడులోని దుండిగల్‌లో గురువారం రాత్రి దారుణం జరిగింది. ఓ ప్రైవేటు హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ మైనర్ బాలుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు లిఫ్ట్‌లో స్పృహలేని స్థితిలో కనిపించినట్లు పోలీసులు, అగ్నిమాపక అధికారులు తెలిపారు. వారిని దవాఖానకు తరలించామని, వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారని చెప్పారు.
ఈ దవాఖాన త్రిచి రోడ్డులో ఉంది. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన చేరుకున్నాయి. చికిత్స పొందుతున్న ఇతర 30 మంది రోగులను ప్రభుత్వ జిల్లా దవాఖానకు తరలించారు.