న్యూఢిల్లీ, మే 12: రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్(సిట్) ఏర్పాటైంది.
మరోవైపు ఈ కేసు విచారణలో తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని బుధవారం కోర్టు ఆదేశించగా శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీల్డ్ కవర్లో నివేదికను అందజేశారు. దీంతో కోర్టు తదుపరి విచారణను మే 27కు వాయిదా వేసింది. మరోవైపు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు చేపట్టాలని రెజ్లర్లు చేస్తున్న ఆందోళన కొనసాగుతున్నది.