శ్రీనగర్: జమ్ము కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లోనూ ఉదయపు ప్రార్థనలను జాతీయ గీతంతో ప్రారంభించాలని పాఠశాల వి ద్యా శాఖ ఆదేశించింది. అన్ని పాఠశాలల్లోనూ ఏకరీతిగా మార్నింగ్ అసెంబ్లీని నిర్వహించాలని తెలిపింది. విద్యార్థుల్లో ఐకమత్యం, క్రమశిక్షణ భావాల ను నింపడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేసింది.