కోల్‌కతా, మే 31: ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ అలియాస్ కేకే (53) మంగళవారం కన్నుమూశారు. కోల్‌కతాలో ఓ సంగీత విభావరిలో గంటపాటు ఆయన గానం చేశారు. అనంతరం అస్వస్థతకు గురైన ఆయన్ని దవాఖానకు తరలిస్తుండగా మరణించినట్టు సన్నిహితులు తెలిపారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ తదితర భాషల్లో వందలాది పాటలను ఆయన ఆలపించారు. తెలుగులో అతడు, ఆర్య 2, గుడుంబా శంకర్, ఘర్షణ, జల్సా, డార్లింగ్, శంకర్‌దాదా ఎంబీబీఎస్, చిరుత, ఎవడు, బాలు తదితర చిత్రాల్లో ఆయన పాటలు పాడారు.