సింగపూర్ సిటీ: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా సింగపూర్ పాస్‌పోర్ట్ నిలిచింది. ఈ దేశ ప్రజలు వీసా లేకుండానే 192 దేశాలను చుట్టిరావచ్చు. వివిధ దేశాల ప్రజలు వీసా లేకుండా ఇతర దేశాలకు వెళ్లేందుకు ఉన్న అనుమతుల ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈ వివరాలను వెల్లడించింది. జర్మనీ, స్పెయిన్, ఇటలీ సంయుక్తంగా ద్వితీ య స్థానంలో నిలిచాయి. గత ఏడాది ప్రథమ స్థానంలో ఉన్న జపాన్ మూడో స్థానానికి పడిపోయింది. 57 దేశాలకు ప్రయాణించే వీలు కల్పిస్తున్న భారత వీసా 80వ స్థానంలో నిలిచింది.