Bengal singer : ఒక పాఠశాలలో జరిగిన లైవ్ కాన్సర్ట్‌లో సెక్యులర్ పాట (Secular Song) పాడాలంటూ ఓ వ్యక్తి తనను వేధించాడని బెంగాలీ సింగర్ (Bengali Singer) లగ్నజిత్ చక్రవర్తి (Lagnajita Chakraborty) ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. శనివారం తూర్పు మిడ్నాపుర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల (Private school) లో ఈ లైవ్ కాన్సర్ట్ జరిగిందని, అందులో ఈ ఘటన చోటుచేసుకుందని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో భక్తి పాట పాడుతుండగా మెహబూబ్ మాలిక్ అనే వ్యక్తి వేదికపైకి వచ్చి అడ్డుతగిలినట్లు లగ్నిజిత్ తెలిపారు. తనను దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. భక్తి పాటలు కాకుండా ‘సెక్యులర్’ పాటలు పాడాలని తనపై ఒత్తిడి చేశాడని వాపోయారు. మాలిక్ ఆ పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యుడేనని పేర్కొన్నారు. తన ఫిర్యాదు తీసుకునేందుకు భగవాన్‌పుర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నిరాకరించినట్లు ఆరోపించారు.
ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. గాయనిపై దాడికి ప్రయత్నించిన మాలిక్ అధికార టీఎంసీ సభ్యుడని బీజేపీ నేత షాకుదేబ్ పాండా అన్నారు. గాయని ఏ పాట పాడాలో కూడా వారే నిర్దేశించడాన్ని తప్పుబట్టారు.