Simone Tata | దివంగత రతన్ టాటా (Ratan Tata) సవతితల్లి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా (Noel Tata) తల్లి సిమోన్ టాటా (Simone Tata) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 95 ఏండ్లు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సిమోన్.. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. శనివారం ఉదయం కొలాబాలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జన్మించిన సిమోన్ 1953లో 23 ఏళ్ల వయస్సులో పర్యాటకురాలిగా భారత్‌ను మొదటిసారి సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా నావల్ టాటాతో సిమోన్కు పరిచయం ఏర్పడింది. అప్పటికే నావల్ టాటాకు సూని టాటాతో వివాహం అయ్యింది. ఇక వీరు 1940లో విడిపోయారు. 1955లో నావల్ టాటా.. సిమోన్‌ను వివాహం చేసుకున్నారు. సిమోన్ టాటా బ్యూటీ ప్రొడక్ట్ బ్రాండ్ లక్మే (Lakme founder)ను స్థాపించారు. ఆ తర్వాత రిటైల్ చైన్ ట్రెంట్ లిమిటెడ్‌ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. వెస్ట్సైడ్ను కూడా సిమోన్ ఆధ్వర్యంలోనే స్థాపించారు.
Also Read..
Bomb Threat | హైదరాబాద్ వస్తోన్న విమానానికి బాంబు బెదిరింపులు
DGCA | విమానాల రద్దు వేళ డీజీసీఏ కీలక నిర్ణయం.. పైలట్ల విధులపై ఆంక్షలు సడలింపు
Karthigai Deepam: లోక్‌సభలో కార్తీకదీపం రగడ.. డీఎంకే, బీజేపీ మధ్య ఆరోపణలు