Simba Beer | భారతదేశానికి చెందిన ప్రముఖ క్రాఫ్ట్ బీర్ బ్రాండ్ ‘సింబా’ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటింది. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘వరల్డ్ బీర్ అవార్డ్స్ 2025’లో రెండు పతకాలను కైవసం చేసుకుని, భారత బీర్ పరిశ్రమ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఇందులో ‘సింబా విట్’ రజత పతకాన్ని, ‘సింబా స్టౌట్’ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా, భారతదేశం తరఫున ‘కంట్రీ విన్నర్స్ టేస్ట్’ కేటగిరీలో పతకాలు లభించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా బీర్ తయారీ నిపుణులు, పరిశ్రమ విశ్లేషకులు, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే ఈ అవార్డ్స్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ‘బ్లైండ్ టేస్టింగ్ పద్ధతి’ని అనుసరించి విజేతలను ప్రకటిస్తారు. అంటే బ్రాండ్ పేరు తెలియకుండా కేవలం రుచిని ఆధారంగా తీసుకుని విజేతలను నిర్ణయిస్తారు. ఇంతటి కఠిన పోటీలోనూ సింబా బీర్లు ప్రత్యేకతను నిరూపించుకోవడం విశేషం. రజత పతకం సాధించిన ‘సింబా విట్’ బెల్జియన్ తరహా బీర్.
దీని తయారీలో బార్లీ మాల్ట్, కొత్తిమీర, నారింజ తొక్కలు ఉపయోగించగా.. సిట్రస్ సువాసనలతో తేలికైన, రిఫ్రెషింగ్ రుచిని అందిస్తుందని నిపుణులు ప్రశంసించారు. ఇక కాంస్య పతకం గెలుచుకున్న ‘సింబా స్టౌట్’లో రోస్టెడ్ బార్లీ, డార్క్ మాల్ట్స్ వాడగా.. కాఫీ, చాక్లెట్, క్యారమెల్ ఫ్లేవర్స్‌తో విభిన్నమైన అనుభూతినిస్తుందని అభిప్రాయపడ్డారు. క్రీమీ టెక్స్చర్తో పాటు చివర్లో స్వల్ప చేదుతో ఇది ప్రత్యేకతను సంతరించుకుంటుందని పేర్కొన్నారు. సింబా బ్రాండ్ సాల్ట్‌బోర్న్’ అనే మాతృ సంస్థలో భాగం. వినియోగదారులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. సంప్రదాయానికి ఆధునికతను జోడించి, నాణ్యమైన ముడి పదార్థాలతో ఉత్పత్తులను తయారు చేయడం కంపెనీ ప్రత్యేకత. సింబా బీర్‌తో ప్రస్థానం ప్రారంభించిన సాల్ట్‌బోర్న్.. తరువాత ‘జిగ్‌జాగ్ వోడ్కా’ వంటి స్పిరిట్స్ విభాగంలోకి కూడా అడుగుపెట్టింది. ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడకపోవడమే సింబా విజయానికి మూలకారణమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.