Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Gang robs women passengers | ఒక దొంగల ముఠా, రైల్వే సిగ్నల్‌ను ట్యాంపరింగ్ చేశారు. రైలు నిలిచిపోవడంతో ఒక స్లిపర్ కోచ్‌లోకి ప్రవేశించారు. మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఆ తర్వాత రాళ్లు రువ్వి ప్రయాణికులను భయాందోళనకు గురిచేశారు.
ముంబై: ఒక దొంగల ముఠా, రైల్వే సిగ్నల్‌ను ట్యాంపరింగ్ చేశారు. రైలు నిలిచిపోవడంతో ఒక స్లిపర్ కోచ్‌లోకి ప్రవేశించారు. మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఆ తర్వాత రాళ్లు రువ్వి ప్రయాణికులను భయాందోళనకు గురిచేశారు. (Gang robs women passengers) మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సుమారు పది మంది ఉన్న ఒక దొంగల ముఠా, సల్పా రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నలింగ్ వ్యవస్థను పాడు చేశారు. దీంతో ముంబై-కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడ నిలిచిపోయింది.
కాగా, రైలు ఆగిన తర్వాత ఆ ముఠా ఎస్ 2 కోచ్‌లోకి ప్రవేశించారు. ముగ్గురు మహిళా ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను లాక్కొని పారిపోయారు. బాధిత ప్రయాణికులు తమను వెంబడించకుండా నిరోధించేందుకు ఎస్ 2, ఎస్ 3, ఎస్ 4 కోచ్‌లపై వారు రాళ్లు రువ్వారు. దీంతో ప్రయాణికులు భయాందోళన చెందారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న మీరాజ్ రైల్వే పోలీస్ స్టేషన్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు మహిళా ప్రయాణికుల నుంచి రూ.2 లక్షల విలువైన బంగారు నగలను ఆ ముఠా దోచుకున్నట్లు రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. నిందితులు రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తున్నదని చెప్పారు.
అయితే ఈ ముఠా బృందాలుగా విడిపోయారని, కొందరు రైల్వే సిగ్నల్ వ్యవస్థ సమీపంలో ఉండగా, మరికొందరు దోపిడీకి పాల్పడేందుకు రైలు కోచ్‌లోకి ఎక్కినట్లు రైల్వే పోలీస్ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. ఆ దొంగల ముఠాను అరెస్ట్ చేసేందుకు పలు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సంఘటన నేపథ్యంలో రైళ్లలో భద్రత గురించి ప్రయాణికులు ఆందోళన చెందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- gang
- gold
- halted
- Maharashtra
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

