ముంబై, మే 9: ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలో కొబ్బరికాయలు, దండలు, నైవేద్యాలను అనుమతించటం లేదని ఆలయ అధికారులు శుక్రవారం ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా మే 11 నుంచి ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు.
దక్షిణ ముంబై ప్రభాదేవి ప్రాంతంలోని సిద్ధివినాయక ఆలయానికి రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్నందున ఆలయం పరిసరాల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకున్నట్టు ఆలయ ట్రస్ట్ చైర్మన్ సదా సర్వార్కర్ చెప్పారు.