Gallantry Awards : అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా(Shubanshu Shukla)కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. భారత దేశ కీర్తిని ఇనుమడింపజేసిన ఆయనకు కేంద్రప్రభుత్వం ‘అశోక చక్ర’ను ప్రకటించింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పునస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్యాలంటరీ అవార్డులకు ఆమోదం తెలిపారు. 70 మంది ఆర్మీ అధికారులకు… వీరిలో మరణాంతరం ఆరుగురికి అవార్డులు ప్రకటించారు.
త్రివిధ దళాల్లో విశేష సేవలందించిన వారిని గౌరవిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆదివారం గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది. ఒకరికి అశోక చక్ర, ముగ్గురికి కీర్తి చక్ర, 13 మందికి శౌర్య చక్ర అవార్డులు ప్రదానం చేయనున్నారు. వీరిలో గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అత్యున్నతమైన గ్యాలంటరీ పురస్కారం అశోక చక్రకు ఎంపికయ్యారు. కీర్తి చక్ర, శౌర్య చక్ర అవార్డు అందుకోనున్నది వీళ్లే.
➡️ 982 Personnel of Police, Fire, Home Guard & Civil Defence and Correctional Services awarded Gallantry/Service Medals on the occasion of the Republic Day- 2026
➡️ Medal for Gallantry (GM) are awarded on the ground of Rare Conspicuous Act of Gallantry and Conspicuous Act of… pic.twitter.com/cGTaTfaXVi
— PIB India (@PIB_India) January 25, 2026
కీర్తి చక్ర : మేజర్ అర్ష్దీప్ సింగ్, నయీబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్.
శౌర్య చక్ర : లెఫ్టినెంట్ కల్నల్ ఘటగే ఆదిత్య శ్రీకుమార్, మేజర్ అన్షుల్ బాల్టూ, మేజర్ శివకాంత్ యాదవ్, మేజర్ వివేక్, మేజర్ లీషంగేతమ్ దీపక్ సింగ్, కెప్టెన్ యోగేందర్ సింగ్ ఠాకూర్, సుబేదార్ పీహెచ్ మోసెస్, లాన్సే డఫాదర్ బల్దేవ్ చంద్(మరణాంతరం), రైఫిల్మన్ మంగ్లీమ్ సంగ్ వైపీ, రైఫిల్మన్ ధుర్బా జ్యోతి దత్తా, లెఫ్టినెంట్ కమండార్ దిల్నా కే, లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఏ, అసిస్టెంట్ కమాండర్ వివిన్ విల్సన్.
యువసేన మెడల్ (గ్యాలంటరీ) : వింగ్ కమాండర్ శోభిత్ వ్యాస్, జూనియర్ వారంట్ ఆఫీసర్ కిర్పల్ సింగ్ సలారియా,
నావో సేన మెడల్ (గ్యాలంటరీ) : కమాండర్ నర్దీప్ సింగ్, లెఫ్టినెంట్ కమాండర్ రిషభ్ పుర్బియా, కమాండర్ రాజేశ్వర్ కుమార్ శర్మ, లెఫ్టినెంట్ కమాండర్ ప్రశాంత్ రాజ్, కమాండర్ హర్ప్రీత్ సింగ్, కెప్టెన్ పీయూష్ కటియార్.