న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లాను రోదసిలోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ‘ఏఎక్స్-4’ మిషన్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఉదయం చేపట్టాల్సిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాన్ని భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మార్చినట్టు ఇస్రో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ వద్ద ప్రతికూల వాతావరణం నెలకొన్న కారణంగా లాంచింగ్ టైమ్‌ను మంగళవారం నుంచి బుధవారానికి మార్చినట్టు ఇస్రో పేర్కొన్నది. రాకేశ్ శర్మ తర్వాత మరో భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసిలోకి వెళ్తుండటంతో ‘ఏఎక్స్-4’ మిషన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. నాలుగు దశాబ్దాల తర్వాత రోదసిలోకి వెళ్తున్న భారతీయ వ్యోమగామిగా శుక్లా రికార్డు సృష్టించబోతున్నారు.
ఆ సంస్థ మోదీ ఏజెంట్ ; హెచ్ఏఎఫ్పై దర్యాప్తునకు అమెరికాకు గురుద్వార విజ్ఞప్తి
వాషింగ్టన్: పెన్సిల్వేనియాకు చెందిన హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) బీజేపీ ప్రయోజనాలను ప్రోత్సహిస్తూ విదేశీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నదని ప్రముఖ సిక్కు గురుద్వారా ఆరోపించింది. ఆ సంస్థ భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరపున విదేశీ ఏజెంట్‌గా పనిచేస్తున్నదని, లాభాపేక్ష లేని ఆ సంస్థపై దర్యాప్తు చేయాలని అమెరికాలోని అతి పెద్ద సిక్కు ప్రార్థనా మందిరాలలో ఒకటైన ఫ్రీమాంట్ గురుద్వారా సాహిబ్ ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పెన్సిల్వేనియాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ భారతీయ ఏజెంటా? కాదా? అన్న విషయం నిర్ధారించడానికి వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని న్యాయశాఖను కోరింది. అయితే హెచ్ఏఎఫ్ ఈ ఆరోపణలను ఖండించింది. తమది పూర్తిగా స్వతంత్ర సంస్థ అని, యుఎస్ లేదా విదేశాల్లో ఏ సంస్ధ లేదా రాజకీయ పార్టీలతో సంబంధాలు లేవని పేర్కొన్నది.