ముంబై: అమెరికా వీసాల కోసం భారతీయులు చేసుకుంటున్న దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. దీంతో వీసా ఇంటర్వ్యూ వెయిటింగ్ టైమ్ పెరిగిపోతున్నది. దీంతో దరఖాస్తులు త్వరగా పరిష్కరించేందుకు భారత్‌కు అమెరికా అదనంగా కాన్సులేట్ అధికారులను పంపిస్తున్నది. నలుగురిని తాత్కాలిక విధుల కోసం ముంబైలోని యూఎస్ కాన్సులేట్‌కు బదిలీ చేసింది. ప్రస్తుతం అమెరికా నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ కోసం ముంబైలో 694 రోజులు, ఢిల్లీలో 614 రోజుల వెయిట్ టైమ్ ఉన్నట్టు అమెరికా ప్రభుత్వ వెబ్సైట్ చెప్తున్నది.