లక్నో: ఫ్రూట్ జ్యూస్ షాపు యాజమాని జ్యూస్‌లో మూత్రం కలుపుతున్నాడు. (mixing urine with juice) మూత్రం ఉన్న లీటర్ బాటిల్ ఆ షాపు వద్ద ఉన్నది. దీనిని గుర్తించిన స్థానికులు ఆ వ్యక్తిని నిలదీయడంతోపాటు చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇచ్చి అతడ్ని అప్పగించారు. దీంతో ఫ్రూట్ జ్యూస్ షాపు యాజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడున్న మూత్రం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని అమీర్ ఖాన్, పండ్ల రసాల్లో మూత్రం కలిపి అమ్ముతున్నాడు. సెప్టెంబర్ 13న బాటిల్లో ఉన్న పసుపు రంగు ద్రవాన్ని ఫ్రూట్ జ్యూస్‌లో అతడు కలపడాన్ని కొందరు గుర్తించారు. ఆ బాటిల్‌ను పరిశీలించగా అది మూత్రంగా తేలింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, జ్యూస్‌లో మూత్రం కలుపుతున్న అమీర్ ఖాన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై దాడి చేసి కొట్టారు. ఆ షాపు వద్దకు చేరుకున్న పోలీసులకు అతడ్ని అప్పగించారు. జ్యూస్ షాపు వద్ద ఉన్న మూత్రం బాటిల్ గురించి ఆరా తీయగా అమీర్ ఖాన్ సరిగా సమాధానం చెప్పలేదు. దీంతో అతడితోపాటు సహాయంగా ఉన్న బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూత్రం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బాటిల్‌ను పరీక్ష కోసం పంపినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Uttar Pradesh : In Loni of Ghaziabad, locals caught Mohd. Aamir and Md Kaif mixing Human URINE in juice at their juice shop and selling it to people.
Police even recovered a plastic can filled with Urine at the shop named Khushi Juice Corner. Case has been registered and both… pic.twitter.com/jkC8poGuVn
— Amitabh Chaudhary (@MithilaWaala) September 14, 2024