దారుణం : అంటరానితనం పాటిస్తూ అడ్డంగా బుక్కయిన దుకాణదారు
తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం వెలుగుచూసింది. అంటరానితనం పాటిస్తూ ఓ దుకాణదారుడు కెమెరాలో అడ్డంగా దొరికిపోయాడు.
చెన్నై : తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం వెలుగుచూసింది. అంటరానితనం పాటిస్తూ ఓ దుకాణదారుడు కెమెరాలో అడ్డంగా దొరికిపోయాడు. దళితులకు సరుకులు అమ్మవద్దని గ్రామస్తులు కోరడంతోనే తాను ఇలా చేశానని దుకాణాదారు పేర్కొన్నారు. ఓ వ్యక్తి పెట్రోల్ కావాలని షాపునకు రాగా ఓ వర్గానికి చెందిన వారికి విక్రయించవద్దని గ్రామస్తులు తనను కోరారని దుకాణాదారు చెబుతుండటం వీడియోలో కనిపించింది.
నవంబర్ 28న హిందువులు నిర్వహించిన పంచాయితీలో ఎస్సీలకు ఎలాంటి సరుకులు, వస్తువులు విక్రయించరాదని నిర్ణయించారని, వారికి ఎలాంటి ప్రోడక్ట్ అమ్మరాదని, దళితులను టీస్టాల్స్లోకి, బార్బర్ షాపుల్లోకి అనుమతించవద్దని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘటన తంజావూరు జిల్లా పాపకాడు సమీపంలోని కెలమంగళం గ్రామంలో జరిగింది. ఈ వ్యవహారాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిన స్ధానిక ఎంపీ రవికుమార్ అంటరానితనం పాటిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ కమిషన్‌కు లేఖ రాశారు. దళితుల పట్ల వివక్ష పాటిస్తూ కెమెరాకు చిక్కిన షాపు యజమాని వీరముత్తును ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. వీరముత్తు దుకాణానికి సీల్ వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrest
- Shopkeeper
- thanjavur
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

