Gold Ring | రూ.2 వేలు డిస్కౌంట్ ఇవ్వలేదని.. రూ.కోటి రూపాయల నగలు కొట్టేశాడు!
Gold Ring | ఏ వస్తువులు కొనేటప్పుడైనా ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? అని అడగడం కొందరికి అలవాటు. ఇలా డిస్కౌంట్ ఇస్తే సేల్స్ కూడా బాగుంటాయి. అందుకే చాలా వస్త్రాలు, ఆభరణాల షాపులు డిస్కౌంట్ సేల్స్ పెడుతుంటాయి.
ఏ వస్తువులు కొనేటప్పుడైనా ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? అని అడగడం కొందరికి అలవాటు. ఇలా డిస్కౌంట్ ఇస్తే సేల్స్ కూడా బాగుంటాయి. అందుకే చాలా వస్త్రాలు, ఆభరణాల షాపులు డిస్కౌంట్ సేల్స్ పెడుతుంటాయి. మరికొన్ని రోజుల్లో దసరా పండుగ ఉండటంతో ప్రముఖ ఆభరణాల సంస్థలు ఈ డిస్కౌంట్ సేల్స్పై ఫోకస్ పెట్టడం పరిపాటే. అయితే దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని ఒక షాపు మాత్రం ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వడం లేదు.
ఈ షాపులో ఆభరణాలు కొనేందుకు ఒక 52 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. ఒక ఉంగరం కొందామని అనుకున్నాడు కానీ.. ఆ షాపు యజమాని దానిపై డిస్కౌంట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో కోపం తెచ్చుకున్న కస్టమర్.. ఆ షాపులో రూ.1.24 కోట్ల విలువైన ఆభరణాలు కొట్టేశాడు. దొంగతనం చేసిన ఐదు రోజుల వరకు ఆ షాపు టెర్రస్ మీదనే ఉన్న ఆ కస్టమర్.. బంగారాన్ని కరిగించేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల చేతికి దొరికిపోయిన నిందితుడు.. మరొక వ్యక్తి సాయంతో ఈ దొంగతనం చేసినట్లు వెల్లడించాడు. తను కొన్న ఉంగరంపై రూ.2 వేలు డిస్కౌంట్ ఇవ్వమంటే ఓనర్ నిరాకరించాడని, అందుకే 2.4 కేజీల బంగారం కొట్టేశామని అతను తెలిపాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

