న్యూఢిల్లీ: ఢిల్లీలోని జీటీబీ హాస్పిటల్లో ఓ టీనేజర్ ఆదివారం జరిపిన కాల్పుల్లో ఓ రోగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రియాజుద్దీన్ (32) పొత్తి కడుపు ఇన్ఫెక్షన్తో గత నెల 23 నుంచి ఈ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 24వ వార్డులో ఉన్న ఆయనపై 18 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. వ్యక్తిగత కారణాల వల్లే కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నదని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (సహదర) సురేంద్ర చౌదరి చెప్పారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ఉమా భగవతి దేవాలయాన్ని సుమారు 30 ఏండ్ల తర్వాత తిరిగి తెరిచారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఆదివారం ఉమా భగవతి ప్రాణప్రతిష్ఠ, పూజలు నిర్వహించారు. పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో ఈ దేవాలయంలో పూజలు చేయడానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.