లక్నో: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేతపై ఒక వ్యక్తి షూ విసిరాడు (Shoe Thrown). ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు అతడ్ని చితకబాదారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఎస్పీ ఓబీసీ వింగ్ సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఒక వ్యక్తి బూటు విసిరాడు. ఆగ్రహించిన ఎస్పీ కార్యకర్తలు అతడ్ని పట్టుకుని చితక్కొట్టారు. న్యాయవాది డ్రెస్లో అక్కడకు వచ్చిన నిందితుడ్ని ఆకాష్ సైనీగా గుర్తించారు. గాయపడిన ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఉత్తరప్రదేశ్లో ప్రముఖ ఓబీసీ నేత అయిన స్వామి ప్రసాద్ మౌర్య 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి ఎస్పీలో చేరారు. ఆయన ఇటీవల హిందూ ఇతిహాసం రామచరితమానస్పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అందులోని కొన్ని భాగాలు కులం ఆధారంగా, సమాజంలోని పెద్ద వర్గానికి అవమానకరంగా ఉన్నాయని ఆరోపించారు. ఆ భాగాలను నిషేధించాలని మౌర్య డిమాండ్ చేశారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు తమ పార్టీ నేతలపై ఇలాంటి చర్యలను ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఖండించారు.
VIDEO | A man dressed up as an advocate hurls shoe at Samajwadi Party leader Swami Prasad Maurya in Lucknow. The attacker was later roughed up by Maurya's supporters. More details are awaited. pic.twitter.com/OQCU5G3xVE
— Press Trust of India (@PTI_News) August 21, 2023
Lucknow: समाजवादी पार्टी के ओबीसी महासम्मेलन में स्वामी प्रसाद मौर्य पर फेंका गया जूता
वकील के भेष में आए आकाश सैनी ने फेंका जूता
मौके पर मौजूद समर्थकों ने हमलावर को जमकर पीटा, किया पुलिस के हवाले@SwamiPMaurya @BJP4UP #Lucknow #SamajwadiParty #swamiprasadmaurya #viralvideo pic.twitter.com/bBcjEqXwFl
— Shailendra Singh (@Shailendra97S) August 21, 2023
VIDEO | "His attempt was unsuccessful and he was later roughed up by the workers. Police took him into the custody," says Samajwadi Party leader Swami Prasad Maurya on the shoe-hurling incident in Lucknow earlier today. pic.twitter.com/gpAY5JYo2t
— Press Trust of India (@PTI_News) August 21, 2023
जब घोसी में स्याही फेंकनवाले ने ख़ुद ही बता दिया कि ये काम उससे भाजपाइयों ने ही करवाया है तो फिर अब आगे और क्या कहना। अभी आगे देखियेगा हार का डर भाजपा से क्या-क्या न कराए।
घोसी की जनता सपा की साइकिल ही चुनेगी। pic.twitter.com/XuXlIjeY6j
— Akhilesh Yadav (@yadavakhilesh) August 21, 2023