న్యూఢిల్లీ, డిసెంబర్ 26: అమెరికాలో ప్రపంచ వాణిజ్య సంస్థపై దాడులు, బ్రెగ్జిట్.. ఇలా అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న ఎన్నో విషయాలను ముందుగానే ఊహించి చెప్పిన బాబా వంగ.. 2022 సంవత్సరాన్ని వర్చువల్ రియాలిటీ సంవత్సరంగా పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2022లో ఫోన్లు, ల్యాప్టాప్ల స్క్రీన్లకు అతుక్కుపోతారని ఊహించారు. బల్గేరియాకు చెందిన బాబా వంగా 1911లో జన్మించారు. 1996లోనే చనిపోయారు. అయితే ఆమె గతంలో ఊహించిన విషయాలు నిజమైనప్పుడల్లా ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. బాబా వంగా అసలు పేరు వాంజీలియా గుష్తెరోవా. భారీ తుఫాన్ కారణంగా ఆమె 12వ ఏటనే చూపును కోల్పోయారు. భవిష్యత్తును ఊహించే ప్రత్యేకత కారణంగా ఆమెను ‘బాల్కన్స్ నోస్ట్రడామస్’ అని పిలుస్తారు. ఆమె 5079 సంవత్సరం వరకు ఊహించారు. 5079 తర్వాత ప్రపంచం అంతం అవుతుందన్నారు. సోవియట్ విచ్ఛిన్నం, ప్రిన్సెస్ డయానా మరణం, 2004లో సునామీ, ఒబామా అధ్యక్షుడవటం ఇలా చాలా విషయాలను ఆమె ముందుగానే చెప్పారు.
2022కు సంబంధించి ఆమె ఏం ఊహించారంటే..