న్యూఢిల్లీ: రష్యన్ ఎరువుల కంపెనీలు భారత్‌కు షాక్ ఇచ్చాయి.ప్రపంచవ్యాప్తంగా ఎరువుల సరఫరా తగ్గుతుండటంతో భారతదేశానికి డీ-అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ) వంటి ఎరువులను డిస్కౌంట్ ధరలకు అమ్మడాన్ని నిలిపేయాలని నిర్ణయించాయి. అత్యధికంగా ఎరువులను ఎగుమతి చేసే చైనా విదేశీ అమ్మకాలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. దీంతో రష్యన్ కంపెనీలు ఎరువులను మార్కెట్ ధరకే అమ్మాలని ఆగస్టులో నిర్ణయించాయి. ఫలితంగా భారత్‌పై పెనుభారం పడబోతున్నది.