ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis)పై .. ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం ప్రశంసలు కురిపించింది. వాస్తవానికి బీజేపీ, శివసేన మధ్య 2019లో బ్రేకప్ వచ్చిన విషయం తెలిసిందే. నక్సల్ ప్రభావిత గచ్చిరౌలీ జిల్లాను స్టీల్ సిటీగా మార్చాలని ఫడ్నవీస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ప్రాజెక్టుపై శివసేన పత్రిక సామ్నా స్పందించింది. ఫడ్నవీస్ ప్రయత్నాలను ఆ పత్రికలో ప్రశంసించారు. ఫడ్నవీస్‌ను దేవ బాబుగా పోల్చుతూ సామ్నా కథనం రాసింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఉన్న గచ్చిరౌలీని ఫడ్నవీస్ విజిట్ చేశారని, అక్కడ కొత్త సంవత్సరం సందర్భంగా అభివృద్ధికి బీజం వేసినట్లు ఆ కథనంలో సామ్నా తెలిపింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఫడ్నవీస్ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.