MLA Sanjay: 1987లో పులిని చంపా.. మెడలో ఉంది దాని దంతమే: ఎమ్మెల్యే వీడియో వైరల్
MLA Sanjay Gaikwad: 1987లో వేటకు వెళ్లి పులిని చంపా. దాని దంతాన్ని తీసి మెడలో వేసుకున్నట్లు శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తెలిపారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సామ్నా ఆన్లైన్ ఎడిషన్‌లో రిలీజ్ చేశారు.
ముంబై: శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్(MLA Sanjay Gaikwad) 1987లో పులిని షికారీ చేసినట్లు చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన ఆ ఎమ్మెల్యే.. 37 ఏళ్ల క్రితం వేటకు వెళ్లి పులిని హతమార్చినట్లు వెల్లడించారు. ఆ పులికి చెందిన దంతాన్నే తన మెడలో ధరించినట్లు ఆయన తెలిపారు. విదర్భ ప్రాంతంలో ఉన్న బుల్దానా నియోజకవర్గానికి చెందిన ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెడలో ఉన్న పులి భాగం ఏంటని ఓ వ్యక్తి అడగ్గా.. ఆ ఎమ్మెల్యే దాని గురించి వివరించారు. ఇది పులి పన్ను అని, 1987లో ఓ పులిని వేటాడానని, దాని దంతాన్ని తీసినట్లు ఎమ్మెల్యే గైక్వాడ్ తెలిపారు. సోమవారం శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఉద్దవ్ ఠాక్రేకు చెందిన ప్రత్యర్థి శివసేన వర్గం ఆ వీడియోను సామ్నా ఆన్లైన్ ఎడిషన్‌లో పోస్టు చేశారు.
దేశంలో పులులు వేటాడడం చట్టరీత్యా నేరం. 1987 కన్నా ముందు నుంచి ఆ చట్టం అమలులో ఉన్నది. ఎమ్మెల్యే గైక్వాడ్‌పై చర్యలు తీసుకోవాలని ఉద్ధవ్ వర్గం డిమాండ్ చేస్తోంది.
1987 ला मी वाघाची शिकार केली. तो दात माझ्या गळ्यात आहे”आमदार संजय गायकवाड यांची शिवजयंतीच्या कार्यक्रमात धक्कादायक कबुली#Sanjaygaikwad #Viralvideo #Saamanaonline pic.twitter.com/ssn4u0izdp
— Saamana (@SaamanaOnline) February 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

