చండీగఢ్: శివసేన జిల్లా అధ్యక్షుడిపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆయన బైక్‌పై పారిపోతుండగా వెంబడించారు. దగ్గర నుంచి కాల్పులు జరిపి శివసేన నేతను హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. (Shiv Sena Leader Shot Dead) పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో శివసేన జిల్లా అధ్యక్షుడైన మంగత్ రాయ్ మంగ ఒక షాపు వద్ద పాలు కొంటున్నాడు. ఇంతలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అక్కడకు వచ్చారు. మంగత్ రాయ్‌పై కాల్పులు జరిపారు. అయితే ఆయన పక్కన ఉన్న 12 ఏళ్ల బాలుడికి బుల్లెట్ తగలడంతో అతడు గాయపడ్డాడు.
కాగా, అప్రమత్తమైన మంగత్ రాయ్ వెంటనే బైక్‌పై అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే దుండగులు ఆయనను వెంబడించారు. మరోసారి కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. రక్తం మడుగుల్లో రోడ్డుపై పడిన మంగత్ రాయ్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత దుండగుల కాల్పుల్లో గాయపడిన బాలుడ్ని మోగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మరో హాస్పిటల్‌కు అతడ్ని రిఫర్ చేశారు. శివసేన నేత మంగత్ రాయ్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఏ వర్గానికి చెందిన నేత అన్నది ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, శివసేన నేతలు రోడ్డుపై బైఠాయించి మంగత్ రాయ్ హత్యపై నిరసన తెలిపారు.
Breaking: Last night around 9:30 PM in Moga, three motorcycle-borne assailants shot and killed Mangat Ram Manga, district president of Shiv Sena Bal Thackeray Shinde. In protest, Shiv Sena leaders have announced a shutdown in Moga. Two other individuals were also shot and injured… pic.twitter.com/NfisIvqlAF
— Gagandeep Singh (@Gagan4344) March 14, 2025