ముంబై, ఆగస్టు 7: తనకు గవర్నర్ పదవి ఇస్తామని మోదీ ప్రభుత్వం మోసం చేసిందని శివసేన మాజీ ఎంపీ ఆనంద్‌రావు అడ్సుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో తనను గవర్నర్‌గా నియమించకపోతే బీజేపీ ఎంపీ నవనీత్ రాణా కులం సర్టిఫికెట్‌కు సంబంధించి సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేస్తానని ఆయన హెచ్చరించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు రాణా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆయన ఈ ఎన్నికల సమయంలో, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ పదవి ఇస్తామంటూ అమిత్ షా తనకు హామీ ఇచ్చారని అడ్సుల్ తాజాగా తలిపారు. దానిని నిల బెట్టుకోవాలని డిమాండ్ చేశారు.