ఖట్మండు : ఎవరెస్ట్ పర్వతం పగుళ్లలో చిక్కుకున్న క్లైంబర్‌ను కాపాడిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రొఫెషనల్ పర్వతారోహకుడు జిస్మన్ తమంగ్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వైరల్ క్లిప్‌లో క్లైంబర్ ఎవరెస్ట్ మౌంటెన్ పగుళ్లలో చిక్కుకుపోవడం కనిపిస్తుంది.
క్లైంబర్ పూర్తిగా మంచులో కూరుకుపోగా పర్వతారోహకులు, సహాయకులు బాధితుడి భుజాలకు తాడును అటాచ్ చేయడం ఈ క్లిప్‌లో చూడొచ్చు. క్యాంప్ 1, క్యాంప్ 2 మధ్య క్లైంబర్ పడిపోయాడని, అతడిని కాపాడటం నిజంగా అద్భుతమని తమంగ్ రాసుకొచ్చారు.
During every climbing season on Mount Everest, many brave rescues take place. The media tends to focus and highlight the rescues involving clients and foreign climbers, but there are lesser-known stories, such as this one, where a sherpa’s life is saved.
We successfully rescued… pic.twitter.com/6uwfp8ApJ5
— Gesman Tamang (@GesmanTamang) June 8, 2023
ఎవరెస్ట్ పర్వతంపై ప్రతి క్లైంబింగ్ సీజన్లో ఎన్నో సాహసంతో కూడిన రెస్క్యూలు జరుగుతుంటాయని, క్లయింట్లు, విదేశీ క్లైంబర్లను కాపాడిన ఘటనలనే మీడియా హైలైట్ చేస్తుందని, కానీ ఇలాంటి సహాయకుల ప్రాణాలను కాపాడిన ఘటనలు అరుదుగా బయటకు వస్తాయని రాసుకొచ్చారు. మౌంటెన్ వర్కర్ల త్యాగాలు, వారు ఎదుర్కొనే ముప్పులను ఈ స్టోరీ గుర్తుచేస్తుందని ఆయన ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.