రేప్.. టెకీ అల్లిన కథే.. పుణే లైంగికదాడి కేసులో ట్విస్ట్
ఐటీ ప్రొఫెషనల్ (22)పై కొరియర్ ఏజెంట్ లైంగిక దాడి చేసినట్లు నమోదైన కేసు కీలక మలుపు తిరిగింది. పుణే పోలీసు కమిషనర్ అమితేశ్ కుమార్ శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, కొంధ్వాలోని ఫ్లాట్‌లో నివసిస్తున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదులో, కొరియర్ ఏజెంట్‌నని చెప్పుకున్న గుర్తు తెలియని వ్యక్తి తనపై రసాయనాలు జల్లి, అఘాయిత్యం చేశాడని ఆరోపించారు.
- ఆమెకు నిందితుడు ముందే తెలుసు
- ‘బెదిరింపు మెసేజ్’ ఆమే రాసుకుంది!
ముంబై, జూలై 4 ( నమస్తే తెలంగాణ)/పుణే : ఐటీ ప్రొఫెషనల్ (22)పై కొరియర్ ఏజెంట్ లైంగిక దాడి చేసినట్లు నమోదైన కేసు కీలక మలుపు తిరిగింది. పుణే పోలీసు కమిషనర్ అమితేశ్ కుమార్ శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, కొంధ్వాలోని ఫ్లాట్‌లో నివసిస్తున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదులో, కొరియర్ ఏజెంట్‌నని చెప్పుకున్న గుర్తు తెలియని వ్యక్తి తనపై రసాయనాలు జల్లి, అఘాయిత్యం చేశాడని ఆరోపించారు. అయితే, ఆమె చెప్పిన నిందితుడు కూడా అత్యధిక విద్యార్హతలుగల ప్రొఫెషనలేనని వెల్లడైంది.
వీరిరువురూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, సుమారు రెండేళ్ల నుంచి ఇరువురికి పరిచయం ఉంది. ఆమె సాక్ష్యంగా చూపిన సెల్ఫీ కూడా ఆమె తన ఫోన్‌ను ఉపయోగించి తీసుకున్నదే. దీనిలో ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ ఆమె ఆ ఫొటోను ఎడిట్ చేసింది. అతను ఆమెపై ఎటువంటి రసాయనాలను జల్లలేదు. బెదిరింపు మెసేజ్‌ను కూడా ఆమె స్వయంగా టైప్ చేసుకుంది. ఆమె మానసిక స్థితి ప్రస్తుతం సక్రమంగా లేదు. రేప్ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

