హైదరాబాద్ : శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ ఈ ఉదయం ముంబైలోని ఖార్ హిందూజ దవాఖానలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్(98)ను ఎన్సీపీ అధినేత శరాద్ పవార్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. దిలీప్ కుమార్ సతీమణి సైరా బానుతో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని శరాద్ పవార్ ఆకాంక్షించారు. ఉదయం వైద్యులు దిలీప్ కుమార్కు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నది. గత నెలలోదిలీప్ కుమార్ సాధారణ వైద్య పరీక్షల కోసం ఇదే దవాఖానలో చేరిన విషయం తెలిసిందే.
Visited legendary actor Shri Dilip Kumarji at Khar Hinduja Hospital today to check on his health and treatment, with the veteren actress Smt Saira Banu.
— Sharad Pawar (@PawarSpeaks) June 6, 2021
I wish Shri Dilip Kumarji a speedy recovery and good health!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.