Sharad Pawar | ప్రధాని అభ్యర్ధిగా తెర పైకి ఖర్గే పేరు : ఇండియా కూటమిలో భగ్గుమన్న విభేదాలు
2024 లోక్‌సభ ఎన్నికలకు విపక్ష కూటమి ప్రధాని అభ్యర్ధిని ప్రకటించని క్రమంలో ఎమర్జెన్సీ అనంతరం 1977 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రధాని అభ్యర్ధి పేరును ప్రకటించలేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ (Sharad Pawar) చేసిన వ్యాఖ్యలు కూటమిలో లుకలుకలను బహిర్గతం చేశాయి.
న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేరు తెరపైకి రావడం కూటమిలో విభేదాలకు కేంద్ర బిందువైంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు విపక్ష కూటమి ప్రధాని అభ్యర్ధిని ప్రకటించని క్రమంలో ఎమర్జెన్సీ అనంతరం 1977 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రధాని అభ్యర్ధి పేరును ప్రకటించలేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ (Sharad Pawar) చేసిన వ్యాఖ్యలు కూటమిలో లుకలుకలను బహిర్గతం చేశాయి.
ఇక ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కూటమి ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదించాయి. ఇక 1977 లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు విజయం సాధించిన అనంతరం మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవి చేపట్టారని, ప్రధాని పేరును ప్రకటించనంత మాత్రాన కోల్పోయేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, సమయం వచ్చినప్పుడు మార్పు దిశగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని పవార్ స్పష్టం చేశారు.
మరోవైపు విపక్ష కూటమి ప్రధాని అభ్యర్ధిగా ఖర్గే పేరును దీదీ ప్రతిపాదించగా కాంగ్రెస్ సైతం సంతోషంగా లేదని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. విపక్ష ఇండియా కూటమిలో చీలిక మరోసారి బట్టబయలైందని ట్విట్టర్ వేదికగా పూనావాలా పేర్కొన్నారు.
Read More :
Saveera Parkash | పాక్‌లో జనరల్ ఎలక్షన్స్.. బరిలో నిలిచిన హిందూ మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

