Sharad Pawar | రాజీనామాపై వెనక్కి తగ్గిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్..!
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ రాజీనామాపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల కమిటీ తీర్మానం మేరకు ఆయన వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ రాజీనామాపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల కమిటీ తీర్మానం మేరకు ఆయన వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. మద్దతుదారులు, ఓటర్లు చాలా సంవత్సరాలుగా తనవెంట ఉన్నారని, వారి మనోభావాలను విరుద్ధంగా వ్యవహరించలేనన్నారు. తనపై ఉన్న ప్రేమ, నమ్మకానికి తాను కదిలిపోయానని, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శరద్ పవార్ ఇటీవల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కమిటీని వేశారు. సమీప భవిష్యత్లో కొత్త తరం విజయవంతం అయ్యేందుకు పార్టీకి సంస్థాగత మార్పులను సూచించారు. ఈ క్రమంలోనే శుక్రవారం కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాజీనామాను తిరస్కరించడంతో పాటు పార్టీ మనోభావాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ముంబయిలోని వైబీ చవాన్ సెంటర్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. కమిటీ సమావేశం ఓవైపు జరుగుతుండగానే.. మరో వైపు కార్యకర్తలు రాజీనామాను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

