Manas Bhunia: ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇప్పుడు వెనుకంజలో మానస్ భునియా
Manas Bhunia: దీదీకి జలక్ ఇచ్చింది బీజేపీ. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ దూసుకెళ్తోంది. బీజేపీ జోరుకు తృణమూల్ కాంగ్రెస్ చేతులెత్తేసింది. అయితే ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన టీఎంసీ నేత మానస్ భునియా.. ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ జలక్ ఇచ్చింది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ టాప్ గేర్లో దూసుకెళ్తున్నది. తాజా సమాచారం ప్రకారం 190 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. మమతా బెనర్జీ సర్కారుకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలు పోటెత్తినట్లు ట్రెండింగ్ ద్వారా తెలుస్తోంది. ఓటర్లు బీజేపీకి బ్రహ్మరథం పట్టడంతో.. ఆ హవాలో తృణమూల్ కాంగ్రెస్ నేత మానస్ భునియా వెనుకంజలో పడ్డారు. పశ్చిమ్ మిడ్నాపూర్ జిల్లాలోని సబాంగ్ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మానస్ భునియా తాజా సమాచారం ప్రకారం వెనుకంజలో ఉన్నారు. ఆ స్థానం నుంచి బీజేపీ నేత అమల్ కుమార్ పండా ఆధిక్యంలో ఉన్నారు. ఆరో రౌండ్ కౌంటింగ్ ముగిసే వరకు ఆయన 1630 ఓట్లు వెనుకబడి ఉన్నారు. మమతా బెనర్జీ సర్కారులో మానస్ భునియా మంత్రిగా చేశారు. పలు శాఖలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. అయితే సబాంగ్ నియోజకవర్గం నుంచి మానస్ భునియా నాలుగు సార్లు టీఎంసీ అభ్యర్థిగా, మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. కానీ ఈసారి ఆయనకు వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

