న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫారసులను అమలు చేయడంలో తాము ‘సున్నితమైన అంశాల’లో జాప్యం చేస్తున్నామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ వెంకటరమణి చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌లు జేబీ పార్ధీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనానికి విన్నవించారు.
ఈ అంశాలు పబ్లిక్ డొమైన్లో బహిర్గత పరచడం సంస్థలకు, పాల్గొన్న న్యాయమూర్తులకు ప్రయోజనం కలిగించదని ఆయన అన్నారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.