Vir Vikram Yadav | డీజీసీఏ నూతన చీఫ్‌గా వీర్ విక్రమ్ యాదవ్.. పలువురు ఉన్నతాధికారుల్ని బదిలీ చేసిన కేంద్రం
Vir Vikram Yadav : డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నూతన చీఫ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
Vir Vikram Yadav : డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నూతన చీఫ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ బ్యూరోక్రాట్ల సాధారణ బదిలీలలో భాగంగా వీర్ విక్రమ్ యాదవ్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది కేంద్రం.
ఇప్పటివరకు ఈ పదవిలో ఫయాజ్ అహ్మద్ కిడ్వాయ్ కొనసాగారు. ఆయన స్థానంలో వీర్ విక్రమ్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన 1996 ఐఏఎస్ (ఒడిశా) బ్యాచ్‌కు చెందిన వారు. ప్రస్తుతం ఆయన కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అదనపు సెక్రెటరీగా పని చేస్తున్నారు. తాజాగా కేంద్రం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. దీని ప్రకారం.. ఫయాజ్ అహ్మద్ కిడ్వాయ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రెటరీగా, పునీత్ కన్సాల్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అడిషనల్ సెక్రెటరీగా, విశాల్ గగన్ సీఐసీ సెక్రెటరీగా, శ్రీధర్ చిరువోలు పీఎంవో అడిషనల్ సెక్రెటరీగా, జ్ఞానేంద్ర త్రిపాఠి ఐసీఏఆర్ అడిషనల్ సెక్రెటరీగా, అన్సుమాన్ పట్నాయక్ కేంద్ర కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరీగా నియామకమయ్యారు.
వీరితోపాటు పలువురు ఐఏఎస్ అధికారుల్ని కేంద్రం బదిలీ చేసింది. ఈ మేరకు అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ (ఏసీసీ) ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

