Watch: గొడుగుతో రైలు పట్టాలపై నిద్రించిన వ్యక్తి.. లోకో పైలట్ ఏం చేశాడంటే?
Man Sleeps On Railway Track | ఒక వ్యక్తి ఎంచక్కా గొడుగు వేసుకుని రైలు పట్టాలపై నిద్రించాడు. ఒక రైలు అతడ్ని సమీపించింది. గమనించిన లోకో పైలట్ ఆ రైలును నిలిపివేశాడు. ఆ వ్యక్తిని నిద్ర లేపి రైలు పట్టాల నుంచి పక్కకు వెళ్లమని చెప్పాడు. ఆ తర్వాత ఆ రైలు ముందుకు కదిలింది.
లక్నో: ఒక వ్యక్తి ఎంచక్కా గొడుగు వేసుకుని రైలు పట్టాలపై నిద్రించాడు. (Man Sleeps On Railway Track) ఒక రైలు అతడ్ని సమీపించింది. గమనించిన లోకో పైలట్ ఆ రైలును నిలిపివేశాడు. ఆ వ్యక్తిని నిద్ర లేపి రైలు పట్టాల నుంచి పక్కకు వెళ్లమని చెప్పాడు. ఆ తర్వాత ఆ రైలు ముందుకు కదిలింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ సంఘటన జరిగింది. చిరు జల్లులు పడుతుండగా ఒక వ్యక్తి ఎంచక్కా గొడుగు వేసుకుని రైల్వే ట్రాక్పై నిద్రించాడు. రైలు పట్టాలపై తల పెట్టి మధ్యలో పడుకున్నాడు.
కాగా, ఒక రైలు ఆ వ్యక్తిని సమీపించింది. రైలు పట్టాలపై అతడు నిద్రపోతుండటాన్ని గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. ఇంజన్ నుంచి కిందకు దిగి ఆ వ్యక్తి వద్దకు చేరుకున్నాడు. మంచి నిద్రలో ఉన్న అతడ్ని తట్టి లేపాడు. రైలు పట్టాల నుంచి పక్కకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలి వెళ్లింది.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ వ్యక్తి చనిపోయే ఉద్దేశంతో రైలు పట్టాలపై పడుకున్నట్లుగా లేదని కొందరు అభిప్రాయపడ్డారు. అతడ్ని పిచ్చివాడిగా మరికొందరు అభివర్ణించారు. మద్యం మత్తులో రైలు పట్టాలపై నిద్రించి ఉంటాడని మరి కొందరు మండిపడ్డారు. ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
A person was sleeping on the railway track with an umbrella. Seeing this, the loco pilot stopped the train, Then he woke him up and removed him from the track. Then the train moved forward in Prayagraj UP
pic.twitter.com/OKzOpHJeih— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

